mouse-in-soft-drink-redbull-can

రెడ్‌బుల్‌ క్యాన్‌లో ఏముందో తెలుసా?

ఆర్కన్సాస్, యూఎస్‌ఏ: రెడ్‌బుల్.. శక్తినిచ్చే ఓ సాఫ్ట్‌డ్రింక్‌గా చాలా ఫేమస్. ఈ డ్రింక్‌ను ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తాగుతారు. దీంతో ఈ ప్రొడక్ట్‌కు వ్యాపార పరిధి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఈ డ్రింక్ లభ్యమవుతోంది. ఇటీవలే జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే రెడ్‌బుల్ సాఫ్ట్‌డ్రింక్ ప్రియులు షాక్‌కు గురవుతారు.

ఓ రెడ్‌బుల్ క్యాన్‌లో ఎలుక పిల్ల ఉంది. నమ్మలేకపోయినా ఇది నిజం. అప్పుడే కొనుగోలు చేసిన డ్రింక్‌ను తాగబోతున్న యువకుడికి ఏదో తేడాగా అనిపించడంతో క్యాన్‌ను నిశితంగా గమనించాడు. క్యాన్‌లో ఎలుక పిల్ల ఉందని గుర్తించాడు. దీంతో అందరూ చూస్తుండగా వీడియో చిత్రీకరిస్తూ కత్తితో క్యాన్‌ను కోశాడు. లోపల ఎలుక పిల్ల ఉంది. దీంతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియోను బాధిత యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా విసుగుగా ఉందంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే అనేకమంది చూశారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని పట్టించుకోరా.. అంటూ తయారీదారులపై నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అమెరికాలోని ఆర్కన్సాస్ అనే రాష్ట్రంలో వెలుగలోకి వచ్చింది.