mother-killed-two-children-

తల్లి ఇద్దరు పిల్లలను చంపేసి..

టెక్సాస్: ఓ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలను హత్య చేయబడ్డారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఇద్దరు పిల్లలు బాత్ టబ్‌లో మునిగి చనిపోయారు. పిల్లలు చనిపోయిన గదికి పక్క గదిలోనే పిల్లల తల్లి కూడా చనిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లూకా న్యూనిజ్(32) అనే మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు.

న్యూనిజ్ భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు. భర్త ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలిద్దరూ బాత్ టబ్‌లో పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. వెంటనే అతడు ఇంట్లో వెతకగా న్యూనిజ్ కూడా పక్క గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని పోలీసులు తెలిపారు.