:: Welcome to NRI - Article ::

పసివాడిపై కన్నతల్లి పైశాచికత్వం.. 3 రోజుల పాటు..

ఫ్లోరిడా: చంటిపిల్లలను తల్లులు కంటికి రెప్పలా రక్షిస్తారు. పిల్లలకు ఏ చిన్న నొప్పి కలిగినా భరించలేరు. అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ మహిళ మాత్రం అందిరిలా ప్రవర్తించలేదు. కర్కశంగా వ్యవహరించింది. కేవలం 1 సంవత్సరం వయసున్న తన కొడుకుని ఇంటికి సమీపంలోని ఓ భవనంలో ఒంటరిగా వదిలిపెట్టింది.  మూడు రోజులపాటు ఎటువంటి ఆహారం లేకుండా చేసింది. దీంతో పసివాడు విలవిల్లాడిపోయాడు. అదృష్టం కొద్ది ప్రాణాలు దక్కాయి. పసివాడి ఏడ్పులు వినపడిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. నిందితురాలు బాలుడి తల్లి అస్లే బాస్కెట్ అరెస్టు చేసి జైలుకి తరలించారు. డ్రగ్స్ మత్తులో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దారుణమైన ఈ ఘటన పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఓ తల్లి ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా దారుణమని విమర్శిస్తున్నారు.