mother-in-law-gave-birth-to-her-grandson

మనవడికి జన్మనిచ్చిన నానమ్మ..

అర్కానాస్(అమెరికా): పెళ్లయి యేళ్లు గడుస్తున్న వారికి పిల్లలు పుట్టడం లేదు. భార్యాభర్తలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి భార్య గర్భంలో ఏదో లోపం ఉందని వైద్యులు భర్తకు తేల్చి చెప్పేశారు. అతడి భార్య గర్భం దాల్చినా కూడా మోయలేదన్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. వారి పరిస్థితి గమనించిన భర్త తల్లి తన కోడలి గర్భాన్ని మోసేందుకు ముందుకు వచ్చింది. తన కొడుకు కళ్లల్లో సంతోషం నింపడం కోసమే తాను ఆ పని చేసేందుకు ఒప్పుకున్నానని పాటి రెస్కర్(50) తెలిపింది. తన కోడలు కెల్లా జోన్స్(29)కి పిల్లలంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. సరోగసీ విధానం ద్వారా పాటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తన కోడలు జన్మనివ్వాల్సిన పసిప్రాణానికి తాను జన్మనిచ్చానని పాటి ఆనందం వ్యక్తం చేసింది.