mother-arrested-for-sexual-abuse-on-16-months-child

16 నెలల కూతురిపై కన్నతల్లి లైంగిక దాడి..తర్వాత..

టుల్సా, ఓక్లహామా: ఓ మహిళ తానొక కన్నతల్లిననే విషయాన్ని మరచిపోయింది. మచ్చుకైనా మానవత్వం ప్రదర్శించకుండా కేవలం 16 నెలల వయసున్న కూతురిపై రాక్షసత్వాన్ని ప్రదర్శించింది. అత్యంత నీచమైన పనికి పాల్పడి వార్తల్లో నిలిచింది. జెర్రికా లాక్కీ అనే 30 ఏళ్ల మహిళ తన కూతురు, 16 నెలల వయసున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడింది. చిన్నారిపై లైంగిక హింసకు పాల్పడింది. ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్లో రికార్డ్ చేసింది. ఈ వీడియోలను ఫ్లోరిడాలోని తన కొత్త ప్రియుడికి పంపించింది. ఈ వీడియోలను చూడలేకపోయిన ప్రియుడు కలత చెంది ఆమెతో బంధానికి గుడ్‌బై చెప్పాడు. కానీ నిందితురాలి సెల్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను ఆమె మాజీ భర్త గుర్తించాడు. ఆలస్యంగా చేయకుండా నిందితురాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2017 మే నెలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితురాలు జర్రికాకు 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తీవ్రనేరానికి పాల్పడిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారకరమైన ఈ ఘటన అమెరికాలోని ఓక్లహామాలో వెలుగులోకి వచ్చింది.