more-sexual-diseases-expected--

లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని..

కాలిఫోర్నియా: లైంగిక సంబంధ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ యేడాది ఎక్కువ సంఖ్యలో లైంగిక వ్యాధులు వ్యాప్తి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు మూడు వేల మంది లైంగిక వ్యాధులతో బాధపడుతున్నారని స్టేట్ హెల్త్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. లైంగిక వ్యాధులు ఎక్కువగా ముప్ఫై ఏళ్లలోపు వారికే వచ్చినట్లు గుర్తించామన్నారు.

ఎక్కువ మందిలో స్పైహిల్స్, గనేరియా వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని వారు తెలిపారు. లైంగిక వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ మంది తమ సూచనలను పెడచెవిన పెడుతున్నారని వారు తెలిపారు.