Missing-girl-saved-by-drone-equipped-with-thermal-camera

డ్రోన్ సాయంతో బాలికను రక్షించిన పోలీసులు

బోస్టన్: అమెరికాలోని లింకన్‌షైర్ పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో ఓ బాలికను రక్షించారు. 16 ఏళ్ల బాలిక లింకన్‌షైర్ పోలీసులకు ఫోన్ చేసి తనను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని తెలిపింది. పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? అని ప్రశ్నించగా మూసివేసిన ఇండస్ట్రీలా ఉందని, చుట్టూ ఫెన్సింగ్ ఉందని, ఎక్కడున్నానో మాత్రం తెలీదని, తనను ఎత్తుకొచ్చిన వాడు కూడా ఇంకా అక్కడే ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో వారిద్దరూ ఉన్న ప్రదేశాన్ని నిమిషాల్లో కనిపెట్టారు. బోస్టన్ ప్రాంతంలో ఆ బాలికను బంధించినట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను రేపిస్ట్ నుంచి రక్షించారు. వారం రోజుల క్రితం అమెరికాలో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి కనిపించడం లేదనే ఫిర్యాదు రావడంతో డ్రోన్ కెమెరా సాయంతో తక్కువ సమయంలోనే అతను ఎక్కడున్నాడో తెలుసుకున్నారు.