michigan-man-gets-sentence-of-life-in-prison-with-no-chance-for-parole-

ఉబెర్ కిల్లర్..క్యాబ్ బుక్ చేసుకున్నవారిని..

మిచిగాన్: అమెరికాలోని మిచిగాన్ ప్రాంతానికి చెందిన జాసన్ డాల్టన్ అనే వ్యక్తికి కోర్టు జీవితఖైదు విధించింది. ఉబెర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న డాల్టన్ ఉబెర్‌ ఎక్కిన అమాయకులను కిరాతకంగా హతమార్చాడు. ఇదంతా జరిగిన మూడేళ్ల తరువాత తనంతట తానే నేరాన్ని అతనే ఒప్పుకోవడం విశేషం. పైగా జడ్జిని పశ్చాత్తాపం కూడా కోరాడు. జడ్జి అడిగిన అనేక ప్రశ్నలకు డాల్టన్ అవును అనే సమాధానం ఇవ్వడం..హత్యలన్నీ చేసినట్టు ఒప్పుకోవడంతో బెయిల్ కూడా లేకుండా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. మిచిగాన్‌లోని కలామజూ పరిసర ప్రాంతాలలో ఎనిమిది మందిని గన్‌తో కాల్చానని, అందులో నలుగురు మహిళలు అని డాల్టన్ చెప్పాడు. పార్కింగ్‌ ప్రదేశంలో ఉబెర్ క్యాబ్ కోసం వేచిచూస్తున్న నలుగురు మహిళలను కాల్చానని ఒప్పుకున్నాడు. అయితే వారందరినీ ఎందుకు చంపాడన్నది మాత్రం చెప్పలేదు. డాల్టన్ దాడి నుంచి తప్పించుకున్న వాళ్లు కూడా అనేక మంది ఉన్నారు. దాడి సమయంలో భయపడకుండా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ జేబులో నుంచి ఫోన్ తీసి 911కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చినందుకు గాను కార్నిష్ అనే యువతిని జడ్జి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉబెర్ క్యాబ్ కోసం పార్కింగ్ ప్రదేశంలో వేచిచూస్తున్న కార్నిష్ బాయ్ ఫ్రెండ్, వాళ్ల తండ్రిపై డాల్టన్ హత్యాఫ్రయత్నం చేశాడు.  

 
కాగా, డాల్టన్‌కు ఇద్దరు పిల్లలు. ఉబెర్‌ డ్రైవర్ కాకముందు ఇన్సూరెన్స్ అడ్జస్టర్‌గా పనిచేసేవాడు. 2016 ఫిబ్రవరిలో తాను ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అంతకుముందు అతనిపై ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా లేవు. ఈ హత్యల వెనుక కారణం ఏంటనే ప్రశ్న తమను వెంటాడుతోందని ప్రాసెక్యూటర్ జెఫ్ కెటింగ్ చెప్పారు. అయితే డాల్టన్ తన కుటుంబాన్ని, చనిపోయిన వారి కుటుంబాలను కోర్టు పాలు చేయకూడదనే ఉద్దేశంతోనే నేరాన్ని ఒప్పుకొని ఉండవచ్చని డిఫెన్స్ న్యాయవాది సోలిస్ అన్నారు. డాల్టన్ కుటుంబసభ్యలు, బంధువులు కూడా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.