men-allegedly-plotted-to-groom-3-year-old-for-sex

పోర్న్ వీడియోలకు బానిసలై..అమెరికాలో ఇద్దరు వ్యక్తులు..

ఫ్లోరిడా: ఇద్దరు వ్యక్తులు పోర్న్ వీడియోలకు బానిసలయ్యారు. ముఖ్యంగా వారిద్దరూ చిన్న పిల్లల పోర్న్ వీడియోలనే ఎక్కువగా చూశారని వారి మొబైల్‌ఫోన్‌‌లను పరిశీలించిన నిపుణులు తెలిపారు. పోర్న్ వీడియోలలో చూపినట్లుగా వారు కూడా 3 ఏళ్ల పాపపై లైంగికదాడి చేయాలనుకున్నారు. అందుకోసం వారి అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న 3 ఏళ్ల పాపను ఎంచుకున్నారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వారిద్దరూ ఆ పాపను ఎలా ట్రాప్ చేయాలో చర్చించుకున్నారు. పాప తల్లి కూడా ఫేస్‌బుక్‌లో వారి ఫ్రెండ్స్ లిస్టులో ఉందన్న సంగతి వారు గుర్తించలేకపోయారు. వారి మేసేజ్‌లను చదివిన పాప తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. లాఫె బెస్ట్(37), బెంజమిన్ వ్రోస్టర్(39) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నీచమైన పని చేస్తున్నట్లు పాప తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దాంతో వారిద్దరిపై పోలీసులు నిఘా పెట్టారు. రెండు రోజుల తర్వాత కూడా వారు మళ్లీ పాప గురించి చర్చించుకున్నారు. ఆ మేసేజ్‌ల ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి మొబైల్‌ఫోన్‌లను కూడా నిపుణుల సాయంతో తనిఖీ చేశారు. వారు ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తున్నారని తెలిసింది. ఆ ప్రభావంతోనే ఈ నీచనానికి పథకం వేశారని పోలీసులు భావిస్తున్నారు. వారిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నామని పోలీసులు తెలిపారు.