massive-tornado-

టోర్నడో విరుచుకుపడింది

ఓహియో: టోర్నడో విరుచుకుపడింది. బలమైన గాలులు మెల్లగా టోర్నడోగా రూపాంతరం చెందాయని అధికారులు తెలిపారు. బలమైన గాలులు చాలా వేగంగా వీయడంతో చాలా చోట్ల ఇళ్లు, చెట్లు, స్తంబాలు కూలిపోయాయని వారు చెబుతున్నారు. పారిష్ అనే స్థానికుడు మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున సంభవించిన టోర్నడోను చూడలేదన్నాడు.

విద్యుత్ స్తంబాలు కూలిపోవడంతో 1500 ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయిందన్నాడు. తాము రాత్రంతా చీకట్లోనే మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రకృతి విపత్తులను ఎప్పుడు సంభవిస్తాయో ఎవ్వరూ ఊహించలేమని అతడు అభిప్రాయపడ్డాడు.