massive-road-accident-

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఫ్లోరిడా: గురువారం మధ్యాహ్నం గెయిన్స్ ‌విల్లే హైవే రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరికొంతమంది వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు ట్రాక్టర్లు మరో మిని ప్యాసింజర్ వ్యాను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వాహనాలు ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు చెప్పారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించామన్నారు. తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.