massive-rainfall-and-tornado-will-hit

టోర్నడోలు.. తుఫాన్‌లు బీభత్సం సృష్టిస్తాయని..

ఫ్లోరిడా: భారీ తుఫాన్‌లతోపాటు టోర్నడోలు కూడా ప్రజలను వణికించబోతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పామ్ బీచ్ కంట్రీలో ఇప్పటికే కొన్ని చోట్ల బలమైన గాలులు వీస్తుండటంతో కొన్ని చెట్లు, రక్షణగా ఏర్పాటు చేసిన కంచెలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు.

ట్రామ్ పోలైన్స్ కంట్రీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తుఫాన్ కూడా బీభత్సం సృష్టించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.