massive-rain-fall-will-hit-

భారీ వర్షాలు కురుస్తాయని..

ఫ్లోరిడా: గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. అందువల్ల తీర ప్రాంతాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారిందని అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా రానున్న అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తుఫాన్ చెలరేగిన సమయంలో ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఉత్తర ఫ్లోరిడావైపు కదులుతోందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసిన కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటించారు.