massive-hurricane-

భారీ తుఫాన్.. గంటకు 155 మైళ్ల వేగంతో గాలి వీస్తూ..

ఫ్లోరిడా: ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ తుఫాన్ దక్షిణ తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు చోట్లా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు పలు చోట్లా కొండచరియాలకు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి భయంకరమైన తుఫాన్ అమెరికా చరిత్రలోనే చూడలేదని స్థానికులు తెలిపారు. గంటకు 155 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.