massive-fire-in-forest-

క్రమంగా అంతటా వ్యాపిస్తున్న మంటలు..

టెక్సాస్: మనుషుల నిర్లక్ష్యం విలువైన వృక్ష సంపదను నాశనం చేస్తోంది. అలాగే ఎన్నో జంతువుల ప్రాణాలు తీస్తోంది. అడవుల్లో చిన్నగా మొదలైన మంటలు అంతటా వ్యాపిస్తున్నాయి. ఇటీవల ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ ఓక్లామా కంట్రీకి 64 కి.మీ.ల దూరంలో రగులుకున్న మంటలు క్రమంగా పదిహేను వందల కి.మీ.ల మేర ఆక్రమించాయి.

ఓక్లామా కంట్రీలో ఉన్న మొత్తం 14 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలకు ముప్పు తప్పదని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. అయినా  మంటలు అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు.