massive-earthquake-will-hit-

భారీ భూకంపం సంభవించవచ్చని..

కాలిఫోర్నియా: భారీ భూకంపం కాలిఫోర్నియా ప్రజలను వణికించబోతోందని సిస్మాలజిస్టు డాక్టర్ లూసీ జోన్స్ తెలిపారు. భూకంప తీవ్రత దాదాపు 7 మాగ్నిట్యూడ్స్ ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ భూకంపం సంభవించనుందని ఆమె చెబుతున్నారు. ఓక్లాండ్ దగ్గర సముద్రం గర్భంలో జరుగుతున్న మార్పులు అందుకు కారణమవుతాయని లూసీ తెలిపారు. అయితే ఈ భూకంపం సంభవిస్తే వేల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని లూసీ హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.

తీర ప్రాంతాల్లో దాదాపు 80 వేల మంది ప్రజలు నివసిస్తున్నారని వారిని రక్షించుకోవాలని లూసీ అధికారులకు సూచించారు. గతంలో కూడా ఎన్నో భూకంపాలు సంభవించాయని ఆమె అన్నారు. అయితే ఈ సారి సంభవించే భూకంపం పెను ప్రమాదం సృష్టించే అవకాశం ఉందని ఆమె చెబుతున్నారు. సునామీ సంభవించే అవకాశాలు కూడా లేకపోలేదని లూసీ అభిప్రాయపడ్డారు.