massive-car-accident-

ఘోర కారు ప్రమాదం.. డ్రైవర్ 20 అడుగుల దూరంలో పడి..

ఫ్లోరిడా: వాహనాదారులు అతివేగంగా వెళ్లొద్దు. సీటుబెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండని ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెబుతున్నా చాలా మంది వారి మాటలను పెడ చెవిన పెడతుంటారు. అయితే అలాంటి వారు ఒక్కసారి ఈ వీడియో చూడండి. సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఓ వ్యక్తి తన కారును అతివేగంగా నడిపాడు. తీరా కారు టోల్‌ప్లాజా దగ్గరకు చేరుకుంది. అయినా కారు వేగం మాత్రం తగ్గలేదు. దాంతో కారు అదుపు తప్పింది.

టోల్‌ప్లాజా బోర్డర్(కంచె)ను ఢీకొట్టింది. కారు చాలా వేగంగా వచ్చి బోర్డర్‌ను ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వ్యక్తి కారులో నుంచి 20 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. కారులో అద్దాలు పగిలిపోయి చాలా దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే అప్పటికే కారులో మరో అయిదుగురు ప్రయాణికులు కూడా ఉన్నారని వారికి మాత్రం పెద్దగా గాయాలు కాలేదని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.

సిబ్బంది వెంటనే సమాచారం అందించారు. డ్రైవర్‌ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డయింది. మరికొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడకూడదని టోల్ ప్లాజా సిబ్బంది వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన ఫ్లోరిడాలోని ఓక్సోలా కంట్రీలో జూన్3వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. 

వీడియో సౌజన్యం న్యూస్ లీక్