massage-parlors-in-america

మాసాజ్ పార్లర్‌లకు ప్రభుత్వం అనుమతి..

ఫ్లోరిడా: మాసాజ్ పార్లర్‌లకు సంబంధించిన బిల్లులో సవరణలకు ఫ్లోరిడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాసాజ్ పార్లర్‌లలో అనైతిక కార్యకాలపాలు నిర్వహించరాదని ప్రభుత్వం నిర్వాహకులకు స్పష్టం చేసింది. కొంతమంది మాసాజ్ పార్లర్‌ల పేరుతో విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి బానిసలుగా ఉపయోగించుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపించింది. అటువంటి చర్యలను కట్టడి చేసేందుకు ముందుగా పార్లర్‌లలో పనిచేసే అమ్మాయిలకు సంబంధించిన పాస్‌పోర్టులతోపాటు వారి దేశ ఎంబసీ నుంచి అనుమతి ఉండాలని తెలిపింది. ఆ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించాలని నిర్వాహకులకు సూచించింది.