man-won-big-prize-money

20 ఏళ్ల యువకుడు.. లాటరీలో గెలిచిన డబ్బెంతంటే..

ఫ్లోరిడా: 20 ఏళ్ల యువకుడు లాటరీ టిక్కెట్ కొన్నాడు. అలా ఎన్నోసార్లు లాటరీ టిక్కెట్‌లు కొనేవాడు. కానీ, ఒక్కసారి కూడా అతడికి అదృష్టం కలిసిరాలేదు. గతవారం ప్రకటించిన లాటరీ ఫలితాల్లో అతడికి వచ్చిన మొత్తం ఎంతో తెలిసి ఆశ్చర్యపోయాడు. అమెరికా లాటరీ చరిత్రలోనే అంత పెద్ద మొత్తంలో లాటరీలో డబ్బు గెలిచిన వ్యక్తిగా ఆ యువకుడు రికార్డు సృష్టించాడు. తాంపాబే కంట్రీకి చెందిన షేన్ మిస్లార్ తనకు అంత పెద్ద మొత్తం డబ్బు వచ్చిందంటే తానే నమ్మలేకపోయాడు. వెంటనే సోషల్‌మీడియాలో తన ప్లాన్స్ గురించి చెప్పేశాడు. కొంత మొత్తంలో తన కుటుంబసభ్యులకు ఖర్చుచేసి మిగిలిన డబ్బును పేద వాళ్లకు సేవ చేయటానికి ఉపయోగిస్తానని మిస్లార్ చెప్పాడు. ఇంతకీ అతడు గెలిచిన మొత్తం ఎంతంటే 451మిలియన్ డాలర్లు(రూ.2862 కోట్ల 47లక్షల,25వేలు)