:: Welcome to NRI - Article ::

భార్య బెయిల్ కోసం.. ఫ్లోరిడాలోని భర్త ఎంత పని చేశాడంటే..

ఫ్లోరిడా: ఎలుక తోలు తెచ్చి ఏడేళ్లు ఉతికినా.. నలుపు నలుపే కానీ తెలుపు రాదు... అని చిన్నప్పుడు చదువుకున్న వేమన పద్యం గుర్తుండే ఉంటుంది. దొంగతనం చేశారని జైలులో వేస్తే... ఆ వ్యక్తిని బెయిల్‌పై విడిపించడానికి మరో వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాలోని వాల్‌మార్ట్‌లో విలువైన వస్తువులను తీసుకుని బిల్లు చెల్లించకుండా బ్రైన్ క్రూమ్ (48) అనే వ్యక్తి చాటుగా వచ్చేశాడు. వీడియోలో దీన్ని చూసిన షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి అక్టోబర్ 19న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకిలా చేశావు.. తప్పుకదా..? అని అడిగితే.. తన భార్యను పోలీసులు అరెస్టు చేశారనీ, ఆమె బెయిల్ కోసం వాటిని దొంగిలించానని చెప్పుకొచ్చాడు. ఆమె కూడా దొంగతనం కేసులో అరెస్టవడం గమనార్హం. దొంగతనం కేసులో అరెస్టయిన భార్యను విడిపించడానికి  మళ్లీ దొంగతనాన్నే ఎంచుకోవడం విచిత్రం. మొత్తానికి భార్య, భర్త.. ఇద్దరూ జైలుపాలయి.. ఊచలు లెక్క పెడుతున్నారు.