:: Welcome to NRI - Article ::

ప్రియురాలి శవంతో.. ఇంట్లోనే..

ఫిలడెల్ఫియా: న్యూజేర్సీలో నివసిస్తున్న మాథ్యూ సమ్మర్(35)ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాథ్యూ, తన ప్రియురాలు(52), ఆమె కొడుకుతో కలిసి తన ఇంట్లో నివసిస్తున్నాడు. మాథ్యూకు, ఆయన ప్రియురాలికి మత్తుమందులు తీసుకునే అలవాటుంది. వారు రోజు రాత్రి మత్తుమందు తీసుకోకుండా నిద్రపోయేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. మార్చ్ 18న వారి జీవితాల్లో ఒక విషాదకర సంఘటన జరిగింది. రోజులానే ఆరోజు కూడా మాథ్యూ, అతడి ప్రియురాలు మత్తుమందు తీసుకున్నారు. ఆ తర్వాత నిద్రపోయారు. కానీ, తెల్లవారే సరికి ఆమె చనపోయింది. ఒక బెడ్‌పై మాథ్యూ పడుకున్నాడు.

రెండో బెడ్‌పై ఆమె శవం ఉంది. పొద్దున్నే కొడుకు వచ్చి వారిని నిద్రలేపేవాడు. ఆ రోజు ఉదయం కూడా ఆ కుర్రాడు వారి గదికి వచ్చాడు. తల్లిని నిద్రలేపేందుకు ఎంతగా ప్రయత్నించిన ఆమె నిద్రలేవలేదు. అతడికి ఏం చేయాలో పాలపోలేదు. మాథ్యూను కూడా నిద్రలేపేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడు కూడా లేవలేదు. దాంతో చేసేదేమిలేక ఆ కుర్రాడు స్కూల్‌కెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన మాథ్యూ బెడ్‌పై ఉన్న ప్రియురాలి శవాన్ని చూశాడు. ఆమె చనిపోలేదనుకుని, నిద్రలేపాలనుకున్నాడు. కానీ, ఆమె లేవలేదు. తన మిత్రుడైన డాక్టరు ఒకాయనను ఇంటికి రమ్మన్నాడు. అతడు వచ్చి, ఆమెను పరీక్షించి చనిపోయినట్టు చెప్పాడు.

పోలీసులకు ఫిర్యాదు చేయమని మాథ్యూకు సూచించాడు. అయితే మాథ్యూ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆమె తనతోపాటే జీవితాంతం ఉండాలని శవాన్ని అలాగే ఇంట్లో  ఉంచుకున్నాడు. కొద్దిరోజులుగా ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా స్థానికులేవరూ  పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్దిరోజులుగా మాథ్యూతో ఉండాల్సిన అతడి ప్రియురాలు కనిపించుకోకపోవడం వల్ల పక్కింటి వ్యక్తి ఆమె కొడుకు ద్వారా విషయం తెలుసుకున్నాడు. మాథ్యూపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చిచూసేసరికి మాథ్యూ ఆమె శవాన్ని పక్కనే నిద్రపోతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రియురాలి కుమారుడిని చైల్డ్‌కేర్‌సెంటర్‌కు తరలించారు. అయితే ఆమెను ఎవరైన హత్య చేశారా లేక ఆత్మహత్య అనే వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు అంటున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదనే నేరం మీద ప్రస్తుతం మాథ్యూను అరెస్ట్  చేశామని పోలీసులు తెలిపారు. 

Loading...