man-shot-dead

అమ్మాయిని కిడ్నాప్ చేసి.. చివరికి

లాస్‌వెగాస్: ఓ అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి హోటల్ రూమ్‌లో బంధించారు. కొద్దిరోజులుగా వారిద్దరూ ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఆ అమ్మాయి హోటల్ రూమ్‌లో ఉందన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికి ఫోన్ కూడా ఆమెకు అందుబాటులో ఉంచలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమె గురించిన సమాచారం లేకుండాపోయింది. అమ్మాయి కనిపించకుండాపోవడంతో చివరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల సహయంతో ఆమె ఎక్కడైతే కిడ్నాప్ అయిందో ఆ ప్రదేశాన్ని గుర్తించారు.

ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవ్వరా అని పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. స్మిత్, బోన్ అనే ఇద్దరు వ్యక్తులే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. వారి మోబైల్ ఫోన్‌ల ఆధారంగా హోటల్ చిరునామా కనుగొన్నారు. తర్వాత హోటల్‌పై దాడి చేసి అమ్మాయిని కాపాడారు. ఈ క్రమంలో పోలీసులపై బోన్ కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా కాల్పులు జరపడంతో బోన్ అక్కడిక్కడే మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే స్మిత్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.