man-shocks-his-wife

భార్య, ప్రియురాలి మధ్య చిచ్చుపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు

న్యూయార్క్: ఓ వ్యక్తి తన భార్య, ప్రియురాలి మధ్య చిచ్చుపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని న్యూయార్క్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మైక్ స్మిత్(48) అనే వ్యక్తి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంటులో కమ్యూనిటీ అఫైర్స్ అధికారిగా పనిచేశాడు. అయితే అకస్మాత్తుగా మార్చి 7, 2017న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్మిత్ భార్య ఎలిజిబెత్ అన్ మోర్‌హౌస్, ప్రియురాలు జోయా గొలుబెవా ఇద్దరూ ఒకేసారి విడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఇద్దరూ విడిపోయిన కొద్దికాలం తర్వాత బాధతో తన ఫ్లాట్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ ఆత్మహత్యకు సరిగ్గా 11 నెలల ముందు ‘‘ తన ఆస్తి, మరణానంతరం ప్రభుత్వం అందించే పరిహారం మొత్తం ప్రియురాలికి దక్కాలి’’ అంటూ వీలునామా రాశాడు. దీంతో అతడి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భార్యనైన తనకు కాకుండా ఇతరులకు ఆస్తి ఎలా దక్కుతుందంటూ కోర్టును ఆశ్రయించింది. తన భర్త ప్రియురాలితో వాగ్వివాదానికి దిగింది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని, రాష్ట్ర చట్టాల ప్రకారం కోర్టు వ్యవహరించనుందని పోలీసులు తెలిపారు.