:: Welcome to NRI - Article ::

నలుగురు పిల్లలపై లైంగికదాడి చేశాడు

ఓహియో: జోనాథన్ స్కాట్ మోనార్(23) అనే వ్యక్తి అగ్నిమాపకదళంలో కొత్తగా చేరిన వారికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. అతడి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన నలుగురు అమ్మాయిలు అతడిపై ఏప్రిల్5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని అతడు లైంగికంగా వేధించడని అందులో పేర్కొన్నారు. శిక్షణ కాలంలో తమను అతడు, అన్ని రకాలుగా ఉపయోగించుకునేవాడని వారు చెబుతున్నారు.

అతడు చెప్పినట్టు వినకపోతే మమల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవాడని వారు అంటున్నారు. ఏప్రిల్ 18న జోనాథన్, పోలీసుల ముందు లొంగిపోయాడు. అంతేకాదు తాను వారిని లైంగికంగా వేధించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అతడు వేధించిన వారంతా 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న వారేనని పోలీసులు చెబుతున్నారు. ఓహియో కోర్టులో అతడిని ప్రవేశపెట్టారు.

Loading...