man-sent-toy-bomb-to-colleague

ఉన్నతాధికారికి బొమ్మ బాంబు పంపించి..

ఫ్లోరిడా: ఓ పోలీసు అధికారి ఇంటికి గిఫ్ట్ ప్యాకెట్ వచ్చి చేరింది. దాన్ని ఓపెన్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. అదేదో అనుమానాస్పద వస్తువుగా ఆయనకు తోచింది. వెంటనే తన తోటి సిబ్బందిని ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. దైర్యం చేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్యాకెట్ తెరవబోయారు. అయితే అట్ట పెట్టెను తీయగానే 'బూమ్' అని రాసి ఉంది. అందులో బాంబ్ ఉన్నట్లు పోలీసులు భావించారు. తెరిచి చేస్తే నిజంగానే అందులో బాంబ్ ఉందని పోలీసులు తెలిపారు. అయితే సహోద్యోగి గ్రెజ్  తన పై అధికారికి ఆ గిఫ్ట్ ప్యాకెట్ పంపించాడని పోలీసులు తేల్చారు. అయితే తన పై అధికారిని ఆట పట్టిచేందుకే తాను ఆ విధంగా చేశానని గ్రెజ్ చెప్పాడు. ఇది హత్య ప్రయత్నమేమి కాదన్నాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నారు.