:: Welcome to NRI - Article ::

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

ఫ్లోరిడా: టిఫేసీత్రాషర్(33) ఆదివారం రాత్రి హత్యకు గురయింది. క్లిప్పర్ డ్రైవ్‌లో నివసిస్తున్న ఆమెను, బ్లూమరో మెజీయామయ(29) అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. అతడు కూడా అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడని వారంటున్నారు. అతడితో త్రాషర్‌ క్లోజ్‌గా ఉండేదని స్థానికులు చెప్పారు. అప్పుడప్పుడూ వారిద్దరు కలిసి బయటకువెళ్లేవారని, ఒకే గదిలో చాలారోజులపాటు ఉన్నారని వారు తెలిపారు. త్రాషర్ ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులకు దూరంగా ఉంటోందని, మెజీయా కూడా ఉద్యోగప్రయత్నాల్లో భాగంగానే మెక్సికో నుంచి ఇక్కడికి వచ్చాడని, పోలీసులు తెలిపారు. ఇద్దరికీ పరిచయం పెరగిందని, ఆ పరిచయం వారి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారితీసిందని వారు అన్నారు.

మెజీయాకు ఏ ఉద్యోగం దొరకలేదని, దాంతో అతడి ఖర్చులకు త్రాషర్ డబ్బులిచ్చేదని పోలీసులు తెలిపారు. అయితే మధ్య వారు తరచూ గొడవపడుతూ కనిపించారని పక్కింటివారు చెబుతున్నారు. ఆ గొడవ కారణంగానే మెజీయా, త్రాషర్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరగడానికి ఆమెపై లైంగికదాడి జరిగిందని పోలీసులు అంటున్నారు. గురువారం మద్యాహ్నం మెజీయాను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రాషర్‌ను హత్య చేసినప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని వారన్నారు.