man-killed-his-pet-dog-

ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను చంపి..

కాలిఫోర్నియా: ఒక వ్యక్తి తన కారును ఏడంస్తుతుల పార్కింగ్‌లాట్‌లో పార్క్ చేశాడు. షాపింగ్‌మాల్‌లోకి వెళ్లాడు. అతడి వెంట తన పెంపుడు కుక్కను కూడా తెచ్చుకున్నాడు. తన పని ముగించుకుని తిరిగి కారు వద్దకు వచ్చాడు. పెంపుడు కుక్క కూడా అతడి వెంట కారు వద్దకు వచ్చింది. వెంటనే దాన్ని ఏడంస్తుల లాట్‌ నుంచి కిందకి విసిరేశాడు. ఆ కుక్క అక్కడిక్కడే మరణించిందని స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ కుక్కను తాను చంపలేదని అతడు  పోలీసులకు తెలిపాడు. సీసీ టి.వీ. ఫుటేజీ ఆధారంగా నిందితుడు అతడేనని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.