man-got-lottery

ఒకే నెంబరుతో 18 ఏళ్ల నిరీక్షణ... ఎట్టకేలకు జాక్‌పాట్

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఒక వ్యక్తి గత 18 ఏళ్లుగా ఒకే నెంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు అతని నిరీక్షణ ఫలించి ఏకంగా 2 మిలియన్ డాలర్లు (రూ. 13,51,50,000) గెలుచుకున్నాడు. మైకేల్ ట్రాన్ అనే ఈ వ్యక్తి పవర్ బాల్ లాటరీలో విజేతగా నిలిచేందుకు మరోమారు అదే నెంబర్ గల రెండు లాటరీ టిక్కెట్లు కొన్నాడు. చివరికి విజయం సాధించాడు. ఒక లాటరీ టిక్కెట్‌పై 300 డాలర్లు, మరో టిక్కెట్‌పై 2 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ట్రాన్ మాట్లాడుతూ ‘తన లాటరీ టిక్కెట్లకు బహమతి వచ్చినట్టు ఆ కంపెనీ నుంచి ఫోను వచ్చింది. దీంతో నా దగ్గరున్న టిక్కెట్లను చెక్ చేసి నిర్థారించుకున్నాను. ఈ మొత్తంలో కొంత భాగం ఇంటికోసం ఖర్చు చేస్తానని, మరికొంత మొత్తం పొదుపు చేస్తానని తెలిపారు. ఈ టిక్కెట్లను మైకేల్ స్థానికంగా ఉన్న ఒక ఫుడ్ స్టోర్‌లో కొనుగోలు చేశారు.