man-gets-life-sentence-for-killing-baby-boy

బాలుడిని టాయిలెట్‌లో ముంచి చంపాడు !

టెక్సాస్: మానవత్వాన్ని మరచిన ఓ యువకుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. కేవలం ఏడు వారాల వయసున్న పసికందును అత్యంత దారుణంగా హత్య చేశాడు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అంటోనే గోర్మన్ అనే 28 ఏళ్ల యువకుడు తన మాజీ గర్లఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. ఇంట్లోని బాలుడు ఏడుస్తుండడం, ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో ఉద్రేకానికి గురైన యువకుడు బాలుడిని తల్లకిందులుగా టాయిలెట్ బేసిన్‌లో ముంచాడు. దీంతో బాలుడు ఊపిరాడక చనిపోయాడు. ఇంటికి వచ్చిన బాలుడు మృతి చెందాడని గుర్తించి తల్లడిల్లింది. జరిగిన విషయాన్ని అక్కడ ఉన్న పిల్లలు ఆమెకు వివరించారు. దీంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో జరిగిన ఈ ఘటనలో నిందితుడు పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ కేసుపై కోర్టులో విచారణ ఇటీవలే ముగిసింది. నిందితుడు దోషిగా తేలడంతో జీవితకాల జైలుశిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇదిలావుండగా కోర్టుకు హాజరైన నిందితుడు హత్యపట్ల ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. బాధిత కుటుంబాన్ని చూసి నవ్వడం అక్కడున్నవారిని ఆశ్చర్యం, ఆగ్రహానికి గురిచేసింది.