man-fatally-shot-

దుండగుడిని కాల్చి చంపేశారు..

ఓర్లాండో: అత్యవసర చికిత్స కోసమని ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలోకి వెళ్లిన దగ్గర నుంచి ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన వద్ద తుపాకీ ఉందని తన దగ్గరికి వచ్చిన వారిని కాల్చి చంపేస్తానని బెదిరించాడు. దాంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆసుపత్రికి దగ్గరకు చేరుకునేసరికే బయట పేషెంట్లు చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు. ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ఎవ్వరూ దైర్యం చేయడం లేదు. డాక్టర్లందరూ బయటకు వచ్చేశారు. పేషెంట్ల పరిస్థితి గమనించిన పోలీసులు ఆసుపత్రిలోకి వెళ్లారు. దుండగుడు పోలీసులపైకి కాల్పులు జరిపాడు. తరువాత పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు.