man-fatally-killed-

ప్రియురాలిని దారుణంగా చంపేసి..

ఫ్లోరిడా: ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా కాల్చిచంపేశాడు. ఉత్తర ఫ్లోరిడాలోని వాల్‌మార్ట్ షాపింగ్ మాల్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం డేవిడ్ జాన్సన్(50) అనే వ్యక్తి వాల్‌మార్ట్‌కు వచ్చాడు. అప్పటికే అతడి ప్రియురాలు కార్లి(30) అక్కడికి చేరుకుంది. కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్య వారిద్దరు కలిసి ఉండటం లేదని వారి స్నేహితులు చెబుతున్నారు. ఏదో గొడవ జరగడంతో విడిగా ఉంటున్నారని వారు తెలిపారు. ప్రియురాలిని కలిసి ఆమెకు నచ్చజెప్పి తనతోపాటు తీసుకెళ్లేందుకు డేవిడ్ శనివారం వాల్‌మార్ట్‌కు వచ్చాడని స్నేహితులు చెబుతున్నారు. ఇదే క్రమంలో వారి మధ్య చర్చ జరుగుతుండగా మాట మాట పెరిగిందని పట్టరాని కోపంతో డేవిడ్ తనతోపాటు తీసుకువచ్చని తుపాకీతో కార్లిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని వారు చెప్పారు. వెంటనే షాపింగ్ మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారన్నారు. పోలీసులు వాల్‌మార్ట్‌కు చేరుకుని డేవిడ్‌ను అరెస్ట్ చేశారని వారు తెలిపారు.