:: Welcome to NRI - Article ::

అతడు, ఆమెకు తన గుండెను దానం చేశాడు

ఫ్లోరిడా: అతడు చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆమె గుండెల్లో బతికే ఉన్నాడు. అయితే ఆ ఇద్దరు ప్రేమికులు మాత్రం కాదు. సెయింట్ లూయిస్ కంట్రీకి చెందిన జోషాస్వాబెండర్, అనే వ్యక్తి అగ్నిమాపకదళంలో పనిచేస్తుండేవాడు. ఒక రోజు అనుకోని ప్రమాదం జరిగి అతడు చనిపోయాడు. అతడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. అదే సమయంలో అడెల్లా హరిస్, అనే మహిళకు గుండె నొప్పి వచ్చింది. అదే ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె గుండె పనిచేయదని తేల్చిచెప్పారు. గుండె మార్పిడి చేయాల్సిందేనని బంధువులకు తెలిపారు.

ఇప్పటికిప్పుడు గుండె మార్పిడీ అంటే కష్టమేనని అనుకున్నారు. అయితే దేవుడు కరుణించినట్లుగా అదే ఆసుపత్రిలో గుండె దాత దొరికాడు. వెంటనే డాక్టర్లు, అడెల్లాకు గుండె మార్పిడీ చేశారు. ఆ సంఘటన జరిగి ఐదు సంవత్సరాలు గడిచాయి. తనకు గుండె దానం చేసిన వ్యక్తి కుటుంబసభ్యులను కలిసుకోవాలని అడెల్లా ప్రయత్నించింది. కానీ, వారు ఎక్కడ కనిపించలేదు. చివరికి సోషల్‌మీడియా ద్వారా ప్రయత్నించి చూసింది. ఐదు సంవత్సరాలక్రితం ఆ ఆసుపత్రిలో గుండె దానం చేసిన వ్యక్తులెవరని పోస్టు చేసింది. జోషా కొడుకు ఆ పోస్టు చూసి ఆమెను సంప్రదించాడు. తన పుట్టినరోజు రెండు రోజుల ముందే తనకు ప్రాణదానం చేసిన వ్యక్తి కొడుకును కలుసుకుంటున్నానని అడెల్లా ఆనందం వ్యక్తం చేసింది.  

Loading...