:: Welcome to NRI - Article ::

పుట్టినరోజే.. అతడి చివరిరోజు అయింది

ఫ్లోరిడా: ఏ మనిషికైన పుట్టినరోజు అంటే చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు స్నేహితులు, బంధువులతో కలిసి వేడుకగా జరుపుకుంటారు. అయితే ఫ్టోరిడాలో అలెక్సిస్(39), కూడా తన పుట్టిన రోజు పార్టీని చాలా గ్రాండ్‌గా జరుపుకోవాలనుకున్నాడు. అందుకోసం అంతా సిద్ధం చేసుకున్నాడు. బంధువులు, స్నేహితులను ఇంటికి పిలిచాడు. అంతా ఇంటికి చేరుకున్నారు. అతడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అతడు మాత్రం ఎక్కడ కనిపించలేదు. అతడు ఎక్కడున్నాడోనని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. ఇల్లంతా వెతికారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడనుకుని కొందరు బంధువులు తెలిసినవాళ్లను ఆరాతీశారు.

కానీ, అతడి జాడ మాత్రం తెలియలేదు. చివరికి ఒక్కసారి అతడి గదిలోకి వెళ్లి, చూద్దామని ఒక వ్యక్తి వెళ్లి అలెక్సిస్ గది తలుపు తట్టాడు. ఎన్నిసార్లు పిలిచిన అతడు తలుపులు మాత్రం తీయడం లేదు. అతడు ఏదో కీడు శంకించాడు. పార్టీ మొదలుకాబోతున్న అలెక్స్ మాత్రం గదిలోనుంచి బయటకు రాలేదని తలుపులు బద్దలుకొట్టారు. లోపలికి వెళ్లి చూసేసరికి అలెక్సిస్  తుపాకీ గుండు తగిలి రక్తమోడుతున్నాడు. వెంటనే అతడిని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అలెక్సిస్, ఆదివారం మరణించాడని  అతడి బంధువులు చెబుతున్నారు. అతడు, ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైన హత్య చేశారా అనే వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. 

Loading...