:: Welcome to NRI - Article ::

అమెరికాలో కాల్పులు.. వ్యక్తి మృతి

టెక్సాస్: పోలీసులు రాత్రి గం.8లకు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసు ఉన్నతాధికారి డేవిడ్ విల్లే మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి  కౌబాయ్ అని చెప్పారు.       చనిపోయిన వ్యక్తితోపాటు మరికొంత మంది ఒక ఇంట్లో మద్యం సేవిస్తున్నారని ఆయన తెలిపారు. మద్యం సేవిస్తుండగా మొదలైన చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారిందని డేవిడ్ తెలిపారు.

దాంతో ఒకరిపై మరోకరు కాల్పులు జరుపుకునే వరకు వెళ్లారని డేవిడ్ చెప్పారు. గొడవ జరుగుతున్న సమాచారాన్ని స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారని వెంటనే వారు అక్కడికి చేరుకోగానే పోలీసులపై కాల్పులు జరపడం మొదలుపెట్టారని డేవిడ్ తెలిపారు. దాంతో పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారని డేవిడ్ తెలిపారు.