:: Welcome to NRI - Article ::

మనిషి చేసిన చిన్న తప్పు వల్లే..

కాలిఫోర్నియా: అమెరికా నగరాల్లో ఈ మధ్య ప్రకృతి విపత్తులు వరుసగా సంభవిస్తున్నాయని కాలిఫోర్నియా విపత్తు నిరోధక దళం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి కొన్ని విపత్తులకు ప్రకృతి కారణమైతే మరికొన్నింటికి మనుషులు కారణమవుతున్నారని వారు ఆరోపించారు. ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పుతో కాలిఫోర్నియాలో 60 వేల ఎకరాల అటవీప్రాంతం బూడిదకుప్పగా మారిందని వారు ఆవేదన చెందారు.

రోడ్డుపై కారులో వెళ్తున్న ఒక వ్యక్తి విసిరిన సిగరెట్ పీక అడవిలో పడిందని దాంతో మెల్లగా అగ్గిరాజుకుందని వారు తెలిపారు. ఇలాంటి తప్పులు చేయడం వల్లే ప్రకృతిలో మనతోపాటు జీవిస్తున్న జంతువులు, పక్షులకు పెను ప్రమాదం కలిగిస్తున్నామని వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నామని వారన్నారు. కాలిఫోర్నియాలోని సన్‌షైన్ సీటీలో మొదలైన అగ్ని ఎన్నో ప్రాంతాలకు కొన్ని గంటల్లోనే విస్తరించిందని విపత్తు నిరోధక అధికారులు తెలిపారు. దగ్గరలో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు తెలిపారు.