:: Welcome to NRI - Article ::

‘10 మంది వ్యభిచారులను చంపాడు’

న్యూయార్క్: ఓ ఇద్దరు వ్యభిచారిణీలను కొట్టి చంపిన కేసులో 50 సంవత్సరాల జైలుశిక్ష ఎదుర్కొనున్న ఓ వ్యక్తిపై పలు అనుమానాలు  వెలువడుతున్నాయి. ఇదే హంతకుడు మరో 10 మంది వ్యభిచారిణీలను హత్య చేసి ఉంటాడేమోనని అటార్నీ అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన 51 ఏళ్ల జాన్ బిట్రోల్ఫ్ అనే వ్యక్తి 1990లో ఇద్దరు వ్యభిచారిణీలను కొట్టిచంపాడు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మహిళలను బిట్రోల్ఫ్ హత్య చేశాడని న్యాయస్థానంలో రుజువైంది. దోషి బిట్రోల్ఫ్‌కు 50 ఏళ్ల జైలుశిక్షవిధించారు. ఇదిలావుండగా ఐలాండ్ హై ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో 10 మంది వ్యభిచారిణీల చావుకు ఈ బిట్రోల్ఫే కారణం అయ్యుంటాడని న్యూయార్క్‌లోని సుఫ్ఫోక్ కౌంటీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్ని రాబర్ట్.. కోర్టులో ఆరోపించారు. ఈ నేరాలపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. దీంతో 10 మంది మహిళ మరణాల కేసులలో బిట్రోల్ఫ్ పాత్రపై విచారణ జరగనుంది.