:: Welcome to NRI - Article ::

హీరో అనిపించుకుందామనుకున్నాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

ఫ్లోరిడా: అందరి ముందు హీరో అనిపించుకుందామనుకున్న ఒక వ్యక్తి చివరికి తన ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పాము నోటిని ముద్దాడబోయిన అతడు దాని కాటుకు గురయ్యాడు. ఫ్లోరిడాకు చెందిన రాన్‌రేనాల్డ్ మంగళవారం తన పక్కింట్లో రాటిల్ స్నేక్ అనే భయంకరమైన విషసర్పం ఉందని తెలుసుకున్నాడు. చాలా మంది పిల్లలు దాని చుట్టూ చేరి గోల చేస్తున్నారు. ఆ అరుపులు విని రాన్ అక్కడికి వెళ్లాడు. అందరిముందు ఏదైన ఆశ్చర్యకరమైన పని చేయాలనుకున్నాడని, అలా చేసేందుకు పాము నోటిని ముద్దుపెట్టుకోవాలనుకున్నాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. రాన్, అంతకుముందు కూడా ఒక్కసారి ఇలాగే చేశాడని వారన్నారు. అయితే అప్పుడు దేవుడి దయ వల్ల ఏమి కాలేదని కానీ, ప్రస్తుతం దాని భారీ నుంచి రాన్, తప్పించుకోలేకపోయాడన్నారు.

అందరూ వద్దని వారించిన వినలేదని వారంటున్నారు. పాము నోటిని దగ్గర మోహం పెట్టి తన నోరు తెరిచిలోగానే, అది నాలుకపై కాటు వేసిందని వారు చెప్పారు. రాటిల్ స్నేక్ విషం చాలా ప్రమాదకరమని, వెంటనే మనిషి శరీరంలోకి వెళ్లి కొన్ని సెకనులలోనే  రక్తంలో కలిసిపోతుందని వారన్నారు. దానికి తోందరగా విరుగుడు ఇవ్వకపోతే మనిషి కొద్ది నిమిషాల్లోనే మరణిస్తాడని వారన్నారు.  వెంటనే రాన్‌ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించమని వారు చెప్పారు.

అందువల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడంటున్నారు. అయితే రాన్, పక్కింట్లో ఉంటున్న వ్యక్తి రాటిల్ స్నేక్‌తో తనకెమి సంబంధంలేదంటున్నాడు. అది తనకు రాత్రే దొరికిందని దాన్ని తన ఇంట్లోనే ఒక రహస్య ప్రదేశంలో దాచానని చెబుతున్నాడు. మరుసటి రోజు దాన్ని అటవీ సిబ్బందికి అప్పగించాలనుకున్నానని అంతలోనే ఇలా జరిగిందంటున్నాడు.