Man-bites-off-part-of-Texas-officer's-ear,-sentenced-

టెక్సాస్‌లో వైరల్.. కారును ఆపాడని పోలీస్ చెవిని కొరికేశాడు

డెంటన్: అమెరికాలో ఓ వ్యక్తి వింత చర్యకు పాల్పడ్డాడు. కారు ఆపారని చెప్పి పోలీసులపై దాడి చేయడమే కాకుండా..ఓ అధికారి చెవిని కొరికేశాడు. డెంటన్‌లోని ఓ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు రోడ్డుపై అటూ ఇటూ తిప్పుకుంటూ వస్తున్న కారును గమనించారు. ఆ కారును ఆపి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి క్రిస్టోఫర్ రోజర్స్‌ను దిగమనగా..రోజర్స్ పోలీసుపై దాడి చేశాడు. అక్కడే ఉన్న మరో సార్జంట్ రోజర్స్ చేతికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నించగా..అతడు సార్జంట్ చెవిని కొరికేశాడు. వెంటనే అక్కడున్న అధికారులు రోజర్స్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దాడికి గురైన సార్జంట్‌కు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చెవిని గట్టిగా కొరకడంతో చిన్న భాగం తెగిపోయిందని వైద్యులు తెలిపారు. దాడిలో రోజర్స్‌కు కూడా గాయాలవగా..చికిత్స అందిస్తున్న డాక్టర్ ఛాతిపై కూడా మరోసారి దాడి చేశాడు. విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేసినందుకు, తాగి కారు నడిపినందుకు రోజర్స్‌పై కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని డెంటన్ జైలుకు తరలించారు.