man-believes-his-security-camera-captured-an-angel

‘దేవదూత’ ఫోటోలంటూ బయటపెట్టాడు

మిచిగాన్, మిచిగాన్: ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న గ్లెన్ థొర్మన్ అనే ఓ వ్యక్తి ఆసక్తికరమైన విషయాన్ని చెపుతున్నాడు. ఇంటి బయట ఉన్న తన ట్రక్కుపై ‘దేవదూత’ తేలియాడిందని, అనంతరం వెళ్లిపోయిందని అంటున్నాడు. ఇంటికి అమర్చిన సెక్యూరిటీ కెమేరాలు ఈ చిత్రాలను బంధించాయని పేర్కొంటున్నాడు. ఫోటోలో కనిపిస్తున్నది దేవదూతేనని తాను నమ్ముతున్నానని వెల్లడించాడు. గ్లెన్ పేర్కొంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటోను చూసిన పలువురు నెటీజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫోటో అనుమానాస్పదంగా ఉందని కొందరు.. ఫోటోషాప్ సరిగా చేయలేదని మరికొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇదిలావుండగా గ్లెన్ థొర్మన్ పేర్కొంటున్న ఫోటోల్లో ఒక ఫోటోలో బ్లర్ చేసినట్టుగా ‘దేవదూత’ ఆకారం కనిపిస్తోంది. మరో ఫోటోలో ఎగురుతున్న ‘దేవదూత’ ఆకారం కనిపిస్తోంది. సెక్యూరిటీ సిస్టం నుంచి ఈ రెండు ఫోటోలు తన మెయిల్‌కి వచ్చాయని, ఫోటోలను వెంటనే జోర్డాన్ రివర్స్ చర్చి పాస్టర్‌కు పంపించానని, ఈ ఫోటోలను ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టారని అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన గ్లెన్ థొర్మన్ చెపుతున్నాడు.