man-attacked-on-lover-brutally

ప్రియురాలిపై దారుణంగా దాడి చేశాడు

ఫ్లోరిడా, యూఎస్ఏ: తనకు నచ్చని దుస్తులు ధరించి ఫొటో దిగడమే కాకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రియురాలిపై ఓ యువకుడు క్రూరంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. మెలిస్సా జెంట్స్, ఇరిక్ బ్రెట్స్ అనే యువతి, యువకుడు బ్రెజిల్‌కు చెందినవారు. చదువు దృష్ట్యా అమెరికాలోని ఫ్లోరిడా వచ్చారు. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఓ రోజు ‘లో కట్ వెస్ట్ టాప్’ ధరించి ఫొటోలు దిగింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ప్రియుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయమపై ప్రియుడిపై కోపంతో అతడి మనస్థత్వాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆగ్రహానికి గురైన ప్రియుడు.. యువతిపై క్రూరంగా దాడి చేశాడు. తీవ్రంగా కొట్టాడు. ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ గాయాలను కూడా ఫొటోలు తీసిన యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళలపై దాడులపై అవగాహన కల్పించేందుకు తాను ఈ చిత్రాలను పోస్ట్ చేస్తున్నానని తెలిపింది. అయితే నిందితుడు ఇరిక్ ధనవంతుడని ఆమె తెలిపింది. బాధితురాలి ఫొటోలను పలువురు సెలబ్రెటీలు షేర్ చేస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.