:: Welcome to NRI - Article ::

భార్యను హత్య చేసిన భర్త

టెక్సాస్: తన భార్య కనిపించడం లేదంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడు తెలిపిన వివరాల ప్రకారం అంత వెతికారు. కానీ, ఏం లాభం లేకపోయింది. దాంతో వారికి ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే అనుమానం వచ్చింది. అతడి కదలికలపై కన్నేశారు. పోలీసుల కథనం ప్రకారం రిచార్డ్ కంట్రీకి చెందిన డేక్వెలాన్ హరీశ్(35) తన భార్యను హత్య చేసి ఆమె శవాన్ని ఏం చేయాలో తెలియక తన కారు డీక్కిలో వేసి లాక్ చేశాడు.

పిల్లలు, తల్లి గురించి అడగడంతో తనకు తెలియదంటూ సమాధానం చెప్పాడు. రెండు రోజులు గడిచిన తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బయటకు తన భార్య కనపడం లేదని తెగబాధపడినట్లు నటించేవాడని పోలీసులు తెలిపారు. అయితే అతడి నాటకాన్ని పసిగట్టిన పోలీసులు చివరికి అతడే దోషి అని తేల్చి అరెస్ట్ చేశారు. కారు డీక్కిలో నుంచి అతడి భార్య శవాన్ని బయటకు తీసి అంత్యక్రియలు జరిపించారు.