:: Welcome to NRI - Article ::

‘లాస్‌వెగాస్ నరమేధం-2 సృష్టిస్తా సిద్ధంగా ఉండండి’

న్యూయార్క్: ఓ యాప్‌లో తన అకౌంట్‌ను తొలగించడం ఓ యువకుడికి ఆగ్రహాన్ని కలిగించింది. కోపంతో రగిలిపోయాడు. కంపెనీ యాజమాన్యంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘లాస్‌వెగాస్ నరమేధం-2.. మొదలుపెడతాను సిద్ధంగా ఉండండి’ అని బెదిరించాడు. ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. న్యూయార్క్ నగర కేంద్రంగా పనిచేస్తున్న డెన్వర్ అనే కంపెనీకి చెందిన ఓ యాప్‌‌ను ప్రవేశపెట్టింది. యాప్‌ను తమ స్నేహితులకు ప్రమోట్ చేసిన వారికి డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది. కానీ విక్టర్ కాసిల్లాస్ అనే 34 ఏళ్ల వ్యక్తి ఈ యాప్‌ను ఉపయోగించి కంపెనీతో ఆటాడుకున్నాడు. దీంతో నిందితుడి అకౌంట్‌ను యాప్ కంపెనీ ‘ఇబోట్టా’ తొలగించింది. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు కంపెనీ యాజమాన్యంపై బెదిరింపులకు దిగాడు. లాస్‌వెగాస్ నరమేధం-2ని సృష్టిస్తాని, సిద్ధంగా ఉండాలని యాప్ కంపెనీకి బెదిరింపు మెయిల్స్ పంపించాడు. ఆందోళన చెందిన యాజమాన్యం నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వెలుగులోకి వచ్చింది.