man-accused-of-killing-five-women

5 మంది మహిళలను చంపిన వ్యక్తి.. చివరికి

ఫ్లోరిడా: పట్టపగలే ఓ బ్యాంకులో దూరి జేవియర్(21) అనే వ్యక్తి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అయిదుగురు మహిళలు అక్కడిక్కడే మరణించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని జేవియర్‌ను అరెస్ట్ చేశారు. జేవియర్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అందువల్ల ఈ విధంగా కాల్పులు జరిపాడని పోలీసులు చెబుతున్నారు. అయిదుగురు మహిళలు చనిపోయిన తర్వాత ఓ గదిలో దాక్కుకున్న మరో మహిళను కూడా చంపేందుకు జేవియర్ ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. తుపాకీ శబ్ధాలు విని వెనుక డోర్ పగులగొట్టి లోపలికెళ్లి ఆమెను కాపాడామని పోలీసులు చెప్పారు. అయితే జేవియర్‌కు ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.