:: Welcome to NRI - Article ::

జడ్జ్ నియామకం చెల్లదు.. ఆధారాలు చూపాల్సిందే..

టెక్సాస్: అమెరికాలో జడ్జిగా పనిచేయాలంటే తప్పకుండా ఆ దేశ ఓటర్ల లిస్టులో పేరు నమోదై ఉండాలి. అలా ఉన్నవారికి అన్ని అర్హతలు ఉంటేనే జడ్జిగా నియమిస్తారు. సాధారణంగా అన్ని దేశాల్లో ఇలాగే జడ్జిల నియమాకప్రక్రియ జరుగుతుంది. కానీ, మిన్‌ బ్రకెత్ అనే మహిళ లాయర్ కార్పస్ క్రిస్టీ అనే పట్టణంలోని మున్సిపల్ కోర్టుకి న్యాయమూర్తిగా నియమించబడింది. ఆమె నియామకం జరిగిపోయిన తర్వాత కొద్దిరోజులకు న్యాయఅధికారుల సంఘానికి ఆమె తన నివాసదృవపత్రాన్ని సమర్పించలేదు. ఆమె దక్షిణకొరియాకు చెందిన అమ్మాయి కావడం వల్ల నివాసధృవపత్రంతోపాటు ఆమె ఓటరు లిస్టు నంబరును కూడా జతపర్చలేదు. ఆమె వాటిని ఇన్ని రోజులైన సమర్పించలేకపోవడం వల్ల న్యాయధికారులు విధుల నుంచి తప్పించారు.

ఆమె జడ్జిగా కొనసాగలేదని తన అమెరికాకు చెందిన మహిళగా నిరూపించుకోవాలని అప్పుడే మళ్లీ ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని వారు తెలిపారు. ఆమె నాతన్ బ్రకెత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వచ్చింది. అప్పటినుంచే తన నివాసం అమెరికా అయిందని ఆమె అంటోంది. కానీ, అధికారులు మాత్రం ఆధారాలు సమర్పించల్పిందేనని పట్టుబడుతున్నారు. అందువల్ల ఆమె తన ఉద్యోగానికి తోంభై రోజులు సెలవు పెట్టి, ఆధారాలు సేకరించేందుకు అనుమతినిచ్చారు. గ్రాజా బ్రకెత్ అనే మరో న్యాయమూర్తి మాత్రం మిన్‌కు మద్దతుగా నిలిచారు. ఆమె న్యాయాధికారాలను దుర్వినియోగం చేయలేదని తాను అన్ని అర్హతలతోనే ఉద్యోగంలో చేరిందని ఆయన అంటున్నారు. కానీ, ఆమెకు తోంభై రోజులు జీతం లేని సెలవులు ఇవ్వడం దారుణం అంటున్నారు.