:: Welcome to NRI - Article ::

తుఫాన్‌లు అమెరికాను దెబ్బతీస్తాయని అప్పుడే ఊహించాం: అధికారులు

టెక్సాస్: వాతావరణ మార్పులే ప్రస్తుత ప్రకృతి ప్రకోపానికి కారణమని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హట్సాన్ తీరంలో విషపూరిత చెత్తను ఎక్కువగా డంపింగ్ చేస్తున్నారని అందువల్లే సముద్రజలాలు కలుషితమై వాతావరణ మార్పులు తోందరగా వస్తున్నాయన్నారు. నిజానికి అవే తుఫాన్‌లు, వరదలు రావడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికా యూనివర్సటీ విద్యార్థులు 2012లోనే వాటిపై పరిశోధనలు జరిపారని జేసాన్ డెరిన్ అనే వాతావరణశాఖ అధికారి తెలిపారు. అప్పుడు కొన్ని ప్రదేశాలకు వారితో కలిసి తాను ప్రయాణించానని ఆయన తెలిపారు. విషపూరిత చెత్త ఉన్న ప్రదేశాల్లో వాతావరణ మార్పులను తాము గమనించామని ఎప్పుడో ఒకప్పుడూ అవి భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని తాము గ్రహించమన్నారు. కానీ, ప్రభుత్వాలు ఎక్కువగా వాటిపై దృష్టిపెట్టలేదని అందువల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.