:: Welcome to NRI - Article ::

అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇర్మా

ఫ్లోరిడా: హరికేన్ ఇర్మా విజృభిస్తోంది. ఫ్లోరిడా పశ్చిమ తీరాన్ని తాకింది. మియామి నగరాన్ని చిగురాటకులా వణికిస్తోంది. గంటకు 120 కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి. 34 లక్షల మంది రాత్రంతా చీకటిలోనే గడిపారు. ఎక్కడ కరెంట్ లేదు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఎన్నో సహయకార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టింది.

ఫ్లోరిడా డైరెక్టర్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్రాయాన్ కూన్ మాట్లాడుతూ ఫ్లోరిడా ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఈ విపత్తు నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని కోరాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఫ్లోరిడాలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించారు.  విపత్తులు ఏ దేశానికైన చెప్పిరావని ఆయన అభిప్రాయపడ్డారు.