Incredible-moment

సముద్రంలో ఈదుతూ కనిపించి..

కాలిఫోర్నియా: ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు. కుటుంబసభ్యులు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. అంతలో అతడు మాత్రం తన డ్రోన్ కెమెరాతో సముద్ర తీరాన్ని వీడియో తీస్తున్నాడు. తీరానికి కొద్ది దూరంలోనే సముద్రంలో అతడికి ఏదో కదులుతూ కనిపించింది. ఈదుకుంటూ ఓ జీవి తీరంవైపు రావడాన్ని అతడు గమనించాడు. అయితే అది చూసేందుకు చేపలా మాత్రం కనిపించడం లేదు. సముద్రంలో చేపలు, తిమింగలాలు కాకుండా మరో జీవి నివసించే అవకాశం లేదు. ఆ జీవి ఏమిటో  తెలుసుకోవాలని తన డ్రోన్ కెమెరాను ఆ జీవికి మరింత దగ్గరగా తీసుకెళ్లాడు. ఆ జీవి 'కంగారు' అని తెలిసి అతడు ఆశ్చర్యపోయాడు. కంగారు సముద్రంలో తన శైలిలో ఈదుకుంటూ తీరంవైపు వస్తోందని అతడు తెలిపాడు. ప్రాణాలు కాపాడుకోవాలన్న గట్టి నిర్ణయంతో కంగారు పోరాటం చేస్తోందన్నాడు. కొద్దిసేపటికే కంగారు తీరం చేరిందన్నాడు. ఈ వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.