hurricane-effect-

భయంకరమైన తుఫాన్ విరుచుకుపడటంతో..

ఫ్లోరిడా: గంటకు 250 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయి. ఎప్పుడు ఏ చెట్టు, కరెంట్ స్తంబం తమ ఇంటి మీద పడుతుందోనని ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ భయంకరమైన పరిస్థితులు ఫ్లోరిడా అంతటా నెలకొని ఉన్నాయని స్థానికులకు చెబుతున్నారు. పనామా సిటీకి చెందిన ఓ 50 ఏళ్ల మహిళ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఇటువంటి భయంకరమైన తుఫాన్‌ను చూడలేదని తెలిపింది. చాలా చోట్లా కరెంటు స్తంబాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పింది. వాతావరణ శాఖ కూడా ఈ తుఫాన్ భయంకరమైనదని ప్రకటించింది. 1992 తర్వాత ఇంతటి తుఫాన్ సంభవించలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.