:: Welcome to NRI - Article ::

అందమైన అమ్మాయిలను అమ్మేస్తున్నారు.. ఎంత దారుణంగానంటే..

ఫ్లోరిడా: అందంగా ఉన్న అమ్మాయిలను వారు టార్గెట్ చేసుకుంటారు. వారితో పరిచయాలు పెంచుకుంటారు. ఎలాగైన వారిని వ్యభిచార కుపంలోకి దింపాలని శతావిధాల ప్రయత్నిస్తారని పోలీసులు చెబుతున్నారు. అమెరికాలో మానవఅక్రమణ రవాణాలో ఫ్లోరిడా మూడోస్థానంలో ఉందని వారన్నారు. దానికి కారణం ఒక ముఠా అని వారు చెబుతున్నారు. ఆ ముఠా సభ్యులు సోషల్‌మీడియా సైట్ల ద్వారా అమ్మాయిలకు వలవేస్తారని వారికి ఊహల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కబుర్లు చెబుతారని, ప్రపంచంలో తమలాగా ఎవ్వరూ బతకలేరంటూ వారిని నమ్మిస్తారని తీరా ఆ మాటలు నమ్మి వారు వెంట వెళ్లితే ఇక వారి జీవితం ముగిసిపోనట్లేనని పోలీసులు చెబుతున్నారు.

వారికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తారని వారిని వెంటనే వేరే దేశానికి పంపేస్తారని ఎవ్వరైన పలానా అమ్మాయి కావాలని వారిని సంప్రదిస్తే, విమాన చార్జీలు వారి దగ్గర నుంచి వసూలు చేసి టిక్కెట్లు ఇచ్చి ఆ దేశానికి పంపిస్తారని పోలీసులు చెప్పారు. ఈ రాకెట్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని వారు తెలిపారు. అయితే వారిని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించిన కుదరడం లేదని వారు తెలిపారు. 

Loading...