Horrifying-incident-in-newyork

రైల్వేస్టేషన్‌లో ఉన్న యువతికి మూర్ఛ రావడంతో..

న్యూయార్క్: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఓ యువతి ప్రమాదవశాత్తూ రైలు కిందపడి చనిపోయిందని అక్కడున్నవారు అనుకున్నారు. కానీ నమ్మలేని విధంగా ఆమె బతికే ఉండడంతో నమ్మలేకపోతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు ఈ విధంగా ఉన్నాయి. రిక్కె బుఖ్ అనే 22 ఏళ్ల యువతి న్యూయార్క్ నగరంలోని ఓ రైల్వేస్టేషన్‌లో ఉంది. ఫ్లాట్‌‌ఫాంపై వేచివున్న ఆమెకు సడెన్‌గా మూర్ఛవ్యాధి వచ్చింది. ఫ్లాట్‌ఫాం మీద నుంచి కిందపడింది. అదే సమయంలో ఓ ట్రైన్ వచ్చి ఆగింది. క్షణాల్లో కళ్ల ముందే ఘటన జరగడంతో యువతి చనిపోయిందని అందరూ భావించారు. కానీ రైలు ట్రాక్‌, గోడల మధ్య పడడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. కానీ ఆమెను బయటకు తీయడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టింది. వెంటనే దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అదృష్టం కొద్ది ఆమె ప్రాణాలు దక్కాయి. కానీ అక్కడున్నవారు ఈ దృశ్యాన్ని నమ్మలేకపోయారు. యువతి చనిపోయిందని భావించారు. కళ్లముందే జరగిందని, ఏమీ చేయలేకపోయామని, కానీ ఆమె ప్రాణాలతో బయటపడిన తీరు ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అక్కడున్న తెలిపారు.